రాజ్ కిరణ్ ప్రధాన పాత్రగా కన్నడ లో వస్తున్న ఓ కామెడీ హారర్ చిత్రంలో అంజలి నటించనున్నట్లు సమాచారం. కన్నడ చిత్ర పరిశ్రమ లో మంచి పేరున్న హీరోల్లో ఒకరైన పునీత్ రాజ్ కుమార్ తో ఆమె జత కట్టనుంది.
ఇటీవల పోటుగాడు చిత్రానికి దర్శకుడుగా వ్యవహరించిన పవన్ వాడేయార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. పునీత్ రాజ్ కుమార్, అంజలీ జంట గా వస్తున్న ఈ కన్నడ చిత్రానికి ధీర రానా విక్రమ గా టైటిల్ ఖరారు చేశారు. పూర్తి మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ జరుపుకోనుంది. మహేష్ బాబు నటించిన దూకుడు చిత్ర రిమేక్ గా వస్తున్న పునీత్ రాజ్ కుమార్ తదుపరి చిత్రం సమ్మర్ లో విడుదల కానుంది.
కొద్ది పాటి తెలుగు హీరోయిన్లు పెద్ద అవకాశాలతో కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి మంచి పేరు సంపాదించుకున్నారు. మరి అంజలీ కూడా కన్నడ విజయాల రుచి చూస్తుందేమో వేచిచూడాలి
