
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో తెలుగునాట తమ ఇంట్లో అమ్మాయిలా పేరు తెచ్చుకున్న్ హీరోయిన్ అంజలి. అంజలి ప్రస్తుతం తెలుగు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అలాంటి అంజలికి ప్రస్తుతం తమిళంలో ఓ స్టార్ హీరో సరసన నటించే చాన్స్ కొట్టేసింది. తమిళంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో ఇలయతలపతి విజయ్. కత్తి తో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ ప్రస్తుతం పులి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
విజయ్ సరసన శృతి హాసన్, హన్సిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీదేవి ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం అంజలిని అప్రోచ్ అయ్యారు. సినిమాకి ఈ పాత్ర చాలా కీలకం కావడంతో అంజలి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. చింబు దేవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆంధ్ర – తమిళనాడు బార్డర్ ప్రాంతంలో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని శింబు అండ్ సేల్వకుమార్ కలిసి నిర్మిస్తున్నారు.

