రజినీ క్రేజ్..అక్కడ రికార్డ్ ఓపెనింగ్ రాబట్టింది కానీ..

Published on Nov 5, 2021 6:30 pm IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “అన్నాత్తే”. దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ మాస్ సినిమాతో మళ్ళీ వింటేజ్ రజినీని చూస్తామని దర్శకుడు చెప్పాడు. కానీ సినిమాకి మొదటి ఆట నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం తలైవర్ రేంజ్ లోనే రావడం విశేషం.

మన దగ్గర ఏమో కానీ తమిళ నాట బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ని రాబట్టినట్టుగా తెలుస్తుంది. రజినీ గత భారీ సినిమాలు 2.0 ఎక్కువ వసూళ్లతో అదరగొట్టిందట. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అన్నాత్తే 34 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టి ఆల్ టైం రికార్డు ఓపెనింగ్ రాబట్టారట.

దీనిపై నిర్మాతల సైడ్ నుంచి కూడా పాజిటివ్ బజ్ నే వినిపిస్తుంది. మొత్తానికి మాత్రం టాక్ తో సంబంధం లేకుండా మళ్ళీ రజినీ తన కెపాసిటీ చూపించారని చెప్పాలి. కానీ తెలుగు రాష్ట్రాలకు వస్తే మాత్రం రజినీ కెరీర్ లోనే దారుణమైన ఓపెనింగ్స్ ఈ చిత్రం అందుకుంది. అక్కడ ఏమో కానీ ఇక్కడైతే గట్టెక్కడం కష్టం కావచ్చు.

సంబంధిత సమాచారం :