మళ్ళీ ఫాం లోకి వచ్చిన అనూప్ రూబెన్స్

మళ్ళీ ఫాం లోకి వచ్చిన అనూప్ రూబెన్స్

Published on Jun 10, 2014 12:25 PM IST

Anoop-Rubens (1)
ఎన్నో మరచిపోలేని మంచి మంచి సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులకు ఎన్నో మంచి ట్యూన్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్.అతని కెరీర్ మధ్యలో అనూప్ కి కాస్త ఆఫర్స్ తగ్గినా ప్రస్తుతం పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు సైన్ చేస్తూ మళ్ళీ ఫుల్ ఫాం లోకి వస్తున్నాడు.

తను రీసెంట్ గా మ్యూజిక్ అందించిన మనం సినిమా విజయం ఆ సినిమాకి తను అందించిన మ్యూజిక్ తన కెరీర్ కి పెద్ద బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. అలాగే ఈ సినిమా చూసిన ఇండస్ట్రీ ప్రముఖులంతా అనూప్ మ్యూజిక్ ని మెచ్చుకున్నారు. దాంతో అనూప్ కిట్టీలో భారీ బడ్జెట్ సినిమాలన్నీ వచ్చి పడుతున్నాయి. నితిన్ – కరుణాకరన్ సినిమాలతో పాటు వెంకీ- పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’ సినిమాకి, ఎన్.టి.ఆర్ సినిమాకి కూడా అనూప్ మ్యూజిక్ అందించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు