టాలెంటెడ్ బ్యూటీకి బిగ్ ఛాన్స్ !

టాలెంటెడ్ బ్యూటీకి బిగ్ ఛాన్స్ !

Published on Dec 28, 2020 4:16 PM IST

Nivetha Thomas

టాలెంటెడ్ బ్యూటీ నివేదా థామస్ టాలీవుడ్ లో చిన్న సినిమాల‌తో ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలోనే మంచి నటి నటి అని పేరు తెచ్చుకుని యంగ్ హీరోల స‌ర‌స‌న వ‌ర‌స‌గా అవ‌కాశాలు పొందినా… అలాగే స్టార్ హీరో ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమాలో కూడా నటించినా.. నివేదాకి స్టార్ డమ్ మాత్రం రాలేదు. దానికితోడు ఆ తరువాత బిగ్ స్టార్ హీరోల స‌ర‌స‌న కూడా అవ‌కాశాలు సంపాదించ‌లేక‌పోయింది.

ఎన్టీఆర్ లాంటి హీరోతో హీరోయిన్ గా నటించినా.. ఆ సినిమాలో మ‌ల్టిపుల్ హీరోయిన్లు ఉండటంతో నివేదా థామస్ కి సోలో హీరోయిన్ గా గుర్తింపు రాలేదు. అయితే తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావట్లేదు అని అర్ధం చేసుకున్న నివేదా, త‌మిళం పై ఫుల్ ఫోకస్ పెట్టి.. అక్కడ మంచి అవకాశాలనే అందుకుంటుందట. తాజాగా కార్తి హీరోగా రానున్న యాక్షన్ డ్రామాలో నివేదా థామస్ కు హీరోయిన్ గా అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు