“సర్కారు వారి పాట”లో మరో గట్టి ట్రీట్ ఉందా.?

Published on Sep 29, 2020 1:59 pm IST

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మాస్ ఫ్లిక్ సర్కారు వారి పాట ఆన్ కార్డ్స్ లో ఉంది. ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుకున్న ఈ చిత్రం షూట్ వచ్చే నవంబర్ రెండో వారం నుంచి యూ ఎస్ లో ఏకధాటిగా జరగనున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇప్పటికే ఈ సినిమాలో ట్యూన్స్ రెడీ అయ్యాయి. దీనికి ముందు మహేష్ నటించిన “సరిలేరు నీకెవ్వరు”కి దేవీ అందించిన సాంగ్స్ ఎంత ప్లస్ అయ్యాయో తెలిసిందే. ముఖ్యంగా మైండ్ బ్లాక్ సాంగ్ అయితే మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడప్పుడే మర్చిపోరు కూడా.

మరి ఆ సాంగ్ ను ఆ రేంజ్ లో కంపోజ్ చేసి అందించిన శేఖర్ మాస్టర్ కు మహేష్ ఫ్యాన్స్ ఏంన్నో సార్లు థాంక్స్ చెప్పుకున్నారు. మరి అలాంటి శేఖర్ మాస్టర్ సర్కారు వారి పాట కోసం మరోసారి సెట్స్ లో అడుగు పెట్టె సూచనలు ఉన్నట్టుగా టాక్ వినిపిస్తుంది. మరి ఇది ఎంత నిజమో కానీ ఒకేవేళ ఓకే అయ్యినట్టైతే ఇక మహేష్ నుంచి మరోసారి గట్టి ట్రీట్ ఉండడం ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More