‘రాకా’లో మరో బాలీవుడ్ నటుడు ?

‘రాకా’లో మరో బాలీవుడ్ నటుడు ?

Published on Nov 23, 2026 3:05 PM IST

‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ’ కలయికలో రాబోతున్న సినిమా ‘రాకా’. ఐతే, బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని.. ఆయన పాత్ర నిడివి తక్కువే ఉంటుందని.. కానీ ఆయన పాత్రకు తగ్గ ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. డిసెంబర్ రెండో వారం లోపు ఈ సినిమా చిత్రీకరణను ముగించాలని టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ మూవీలో దీపికా పడుకోణె హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ సినిమాలో దీపికా పడుకోణెతో పాటు మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే, జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ కథా నేపథ్యం సాగుతుందట. అన్నట్టు సన్ పిక్చర్స్ వారు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.

తాజా వార్తలు