భోగి రిలీజ్ డేట్.. శర్వాకు కలిసొచ్చే అంశం..!

భోగి రిలీజ్ డేట్.. శర్వాకు కలిసొచ్చే అంశం..!

Published on Nov 23, 2026 4:03 PM IST

Bhogi

నవంబర్ 27న థియేటర్లలో విడుదల కావాల్సిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘హైందవ’, రష్మిక మందన్న ‘మైసా’ చిత్రాలు వాయిదా పడటంతో శర్వానంద్ నటించిన ‘భోగి’ చిత్రానికి సోలో రిలీజ్ దక్కింది. వాస్తవానికి నవంబర్ 12నే విడుదల కావాల్సిన ఈ సినిమా, సెన్సార్ అడ్డంకుల కారణంగా వాయిదా పడింది.

తాజాగా సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న చిత్రబృందం నవంబర్ 27న విడుదలను ఖరారు చేసింది. పోటీలో ఉన్న రెండు ముఖ్యమైన సినిమాలు తప్పుకోవడం ‘భోగి’కి కలిసొచ్చే అంశం. ప్రతి వారం థియేటర్లలో పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో, శర్వానంద్ చిత్రానికి సోలో రిలీజ్ దక్కడం నిర్మాతలకు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి.

సంపత్ నంది దర్శకత్వంలో, కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్ ఒక ఛాలెంజింగ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండగా, సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టడం ఖాయం. అయితే డిసెంబర్ ఫస్ట్ వీకెండ్‌లో మరిన్ని కొత్త సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో, ‘భోగి’ మొదటి వారంలోనే వీలైనంత ఎక్కువ వసూళ్లను రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది.

తాజా వార్తలు