“ఆదిపురుష్”లో జాయిన్ అయ్యిన మరో బాలీవుడ్ నటుడు.!

Published on Jul 15, 2021 7:16 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న భారీ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్”. దేశ వ్యాప్తంగా కూడా తార స్థాయి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరకెక్కుతుంది. మరి ఇందులో ప్రభాస్ రామునిగా, కృతి సనన్ సీతగా నటిస్తున్నారు. కొన్నాళ్ల కితమే మళ్ళీ కరోనా తగ్గుముఖం పడుతుండడంతో మళ్ళీ మకాం ముంబై షిఫ్ట్ చేసేసారు.

అక్కడ నుంచి కూడా జెట్ స్పీడ్ తో ఆదిపురుష్ షూట్ షురూ అయ్యి శరవేగంగా కొనసాగుతుంది. అయితే దాదాపు బాలీవుడ్ క్యాస్టింగ్ తోనే తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు యాడ్ అయ్యినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. టార్జాన్ ది వండర్ కార్, సల్మాన్ జైహో, లేటెస్ట్ గా మాలాంగ్ వంటి ఎన్నో చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు వత్సల్ సేథ్ నటిస్తున్నట్టుగా తెలిపాడు. దర్శకుడు ఓంరౌత్ తో కలిసి కొత్త ఆరంభాలు చేస్తున్నాం అంటూ ట్వీట్ చేసాడు. దీనితో ఈ నటుడు కూడా ఈ చిత్రంలో ఒక భాగం అని కన్ఫర్మ్ అయ్యింది.

సంబంధిత సమాచారం :