రజనీ కోసం మరొక హిందీ విలన్ ?


‘కాలా, 2 పాయింట్ 0’ సినిమాల్ని ముగించి ప్రస్తుతం రాజకీయపరమైన పనుల్లో బిజీగా ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం కోసం భారీ తారాగణాన్ని ఎంపిక చేస్తున్నారు.

అందులో భాగంగానే రజనీకి ప్రతినాయకుడిగా ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికిని సంప్రదించారట దర్శకుడు కార్తీక్. అయితే నవాజుద్దీన్ సిద్ధికి ప్రాజెక్టుకు ఒప్పుకున్నారు లేదా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే ఇప్పటికే రజనీ శంకర్ దర్శకత్వంలో చేసిన ‘2 పాయింట్ 0’ లో హిందీ హీరో అక్షయ్ కుమార్ విలన్ పాత్ర చేయగా పా.రంజిత్ డైరెక్ట్ చేసిన ‘కాలా’ లో మరొక ప్రముఖ హిందీ నటుడు నానా పటేకర్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు.