‘డ్రాగన్’లో మరో బాలీవుడ్ బ్యూటీ ?

‘డ్రాగన్’లో మరో బాలీవుడ్ బ్యూటీ ?

Published on Jun 15, 2026 10:58 AM IST

Dragon

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న సినిమా డ్రాగన్. ఇప్పుడు ఈ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఆ మధ్య వదిలిన గ్లింప్స్ వీడియోలో సినిమాలోని అనేక పాత్రలను ఇంట్రొడ్యూస్ చేసిన ప్రశాంత్ నీల్, కథలోని మెయిన్ కాన్‌ఫ్లిక్ట్‌ను రివీల్ చేయకుండా ఉంచాడట. ఆ మెయిన్ కాన్‌ఫ్లిక్ట్‌ కి సంబంధించిన ట్రాక్ లో కృతి సనన్ కూడా కనిపించబోతుందని తెలుస్తోంది. అన్నట్టు ప్రశాంత్ నీల్ సినిమా అనగానే ఫుల్ బ్లాక్ అండ్ గ్రే షేడ్ ఫ్రేమ్ మాత్రమే ఎక్కువ కనిపిస్తోంది.

కానీ, ఎన్టీఆర్ తో తీస్తున్న ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఫుల్ కలర్ ఫుల్ గా ఉంటుందట. పైగా ఈ ఫ్లాష్ బ్యాక్ లో బ్లాక్ షేడ్ ఫ్రేమ్ కూడా కనిపించదట. మరి ప్రశాంత్ నీల్ ఫ్లాష్ బ్యాక్ కోసం అంత కలర్ ఫుల్ గా ఏం తీస్తున్నాడో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2027 జూన్ 11న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు