మహేష్ సినిమాపై మరో క్రేజీ బజ్..ఎంతవరకు నిజమో?

Published on Jul 9, 2021 8:06 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో “సర్కారు వారి పాట” అనే సాలిడ్ మాస్ ఎంటర్టైనెర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం ఇప్పుడు కొత్త షెడ్యూల్ నిమిత్తం రెడీ కూడా అవుతుంది. దీనితో పాటుగా మరోపక్క సినిమా రిలీజ్ డేట్ పై మళ్ళీ టాలీవుడ్ వర్గాల్లో హంగామా నడుస్తుండగా మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ బయటకి వచ్చింది.

ఈ చిత్రంలో విలన్ రోల్ కి గాను యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ని ఫైనల్ చేసారని తెలిసిందే. అయితే అర్జున్ చేస్తుంది ఒక పోలీస్ రోల్ అని కొత్త టాక్ వినిపించింది. అయితే అది విలన్ పోలీస్ గానో లేక పాజిటివ్ రోల్ లోనో ఏమో కానీ ఇపుడు మరో విలక్షణ నటుడు పేరు ఈ సినిమా విలన్ కి వినిపిస్తుంది. అదే వెర్సిటైల్ నటుడు సముథిరఖని. తన నటన కోసం మూవీ లవర్స్ కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. మరి ఇప్పుడు ఈయన పేరు వినిపించడం ఆసక్తికరంగానే ఉంది కానీ ఇందులో ఎంత వరకు నిజముందో అన్నది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :