పవన్ సినిమాలో మరో స్టార్ హీరోపై క్రేజీ బజ్.!

Published on Oct 30, 2020 7:04 pm IST


లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి అనౌన్స్ కాబడిన చిత్రాల్లో అయ్యప్పణం కోషియం రీమేక్ కూడా ఒకటి. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చిన దగ్గర నుంచీ మాత్రం టాలీవుడ్ లో ఈ సినిమా కోసం చర్చతో నిండిపోయింది. అంతే కాకుండా ఈ సినిమాలోని మరో కీలక అంశం కోసమే భారీ ఎత్తున రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో పవన్ తో పాటుగా మరో పవర్ ఫుల్ రోల్ కూడా ఆధ్యంతం సినిమా అంతా సాగుతుంది. ఆ రోల్ కు గాను చాలా మంది స్టార్ హీరోల పేర్లే ఇప్పుడు చక్కర్లు కొడుతుండగా ఇప్పుడు మరో హాట్ బజ్ లైన్ లోకి వచ్చింది. ఈ బజ్ ప్రకారం ఆ రోల్ కు మరో స్టార్ హీరో పేరు బయటకొచ్చింది. అతను మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్.

మన తెలుగులో ఎన్నో చిత్రాల్లో కీలక పాత్ర పోషించిన కిచ్చా పేరు ఇప్పుడు ఆ రోల్ కు వినిపిస్తుంది. అయితే గత కొన్ని రోజుల కితమే పవన్ ను సుదీప్ కలవడం తెలిసిందే. అప్పుడు కూడా అనేక అనుమానాలు వచ్చాయి. మరి ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఆ రోల్ పై మంచి ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రానికి యువ దర్శకుడు సాగర్ కె దర్శకత్వం వహించనుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More