ప్రభాస్, నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ పై మరో క్రేజీ బజ్.!

Published on May 28, 2021 12:00 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రాలను మించి పాన్ వరల్డ్ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. అదే నాగ్ అశ్విన్ తో ప్లాన్ చేసిన హై బడ్జెట్ స్కై ఫై ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం. ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో మొదలు పెట్టుకొని షూట్ కు సిద్ధం అవుతుంది.

ఆల్రెడీ పాన్ ఇండియన్ కావాల్సిన హంగులను క్యాస్ట్ ను సెట్ చేసుకున్న ఈ చిత్రంపై పాన్ వరల్డ్ చిత్రంగా ఎస్టాబ్లిష్ కావడానికి మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రం ప్రస్తుత కాలానికో లేదా పాత కాలానికి అంటే పీరియాడిక్ డ్రామాలా ఉండదట పూర్తిగా భవిష్యత్తులో ఉండే హాలీవుడ్ చిత్రాల తరహాలో ఉంటుందట.

అంటే 2050 వ సంవత్సరం దాటిన సెటప్ ఈ చిత్రంలో కనిపిస్తుంది అని టాక్ ఇపుడు వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత మేర నిజముందో కానీ ఈ సినిమాకు పెట్టె బడ్జెట్ నాగ్ అశ్విన్ కాన్ఫిడెన్స్ లకు తక్కువేం కాదని చెప్పాలి. మరి ఈ భారీ చిత్రం ఎలా ఉండనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :