“సర్కారు వారి పాట”పై క్రేజీ గాసిప్..నిజమేనా?

Published on Oct 27, 2020 8:56 am IST

ప్రస్తుతం టాలీవడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా డీసెంట్ హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మాస్ ఎంటర్టైనింగ్ చిత్రం “సర్కారు వారి పాట”. మొత్తం మూడు వరుస భారీ హిట్ చిత్రాల తర్వాత మహేష్ టేకప్ చేసిన చిత్రం కావడంతో దీనిపై మరిన్ని అంచనాలునెలకొన్నాయి.

అయితే పరిస్థితులు కనుక బాగున్నట్టయితే ఈపాటికే షూట్ మొదలు కావాల్సి ఉన్న ఈ చిత్రం ఇంకా ఇప్పుడు సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది. ఇదిలా ఉండగా ఈ చిత్రం షూటింగ్ యూఎస్ షెడ్యూల్ తో వచ్చే నవంబర్ 1 నుంచి మొదలు కానుంది అని తెలిసిందే.

కానీ ఇపుడు వినిపిస్తున్న క్రేజీ గాసిప్ ప్రకారం ఇపుడు ఈ చిత్రం షూటింగ్ వచ్చే జనవరికి షిఫ్ట్ అయ్యిందని వినిపిస్తుంది. మరి ఇది నిజమో అన్నది కాలమే నిర్ణయించాలి. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ఎంటెర్టైన్మెంట్ వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More