బాలయ్య కోసం మరో డైరెక్టర్ వెయిటింగ్ !

Published on Jul 11, 2021 7:05 am IST

డైలాగ్ రైటర్ ఎమ్ రత్నం బాలయ్య కోసం ఓ కథను సిద్ధం చేశారు. అయితే ఈ కథను నటసింహం నందమూరి బాలయ్యకు రీసెంట్ గా వినిపించినట్లు తెలుస్తోంది. ఎమ్ రత్నం చెప్పిన స్క్రిప్ట్ బాలయ్యకు కూడా కథ నచ్చింది. ఫుల్ యాక్షన్ తో కూడుకున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా స్క్రిప్ట్ ఉందని, దర్శకుడు శ్రీవాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని అంటున్నారు.

కాకపోతే ఇప్పట్లో బాలయ్య ఈ సినిమా చేసే ఆలోచనలో లేరు. క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ఆల్ రెడీ ఒక సినిమాని ప్లాన్ చేసాడు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో బాలయ్య ఫుల్ బిజీగా ఉన్నాడు. బాలయ్యకు పెద్ద హిట్ ఇవ్వాలనే కసితో బోయపాటి ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయ్యాక, బాలయ్య… గోపీచంద్ తో సినిమా స్టార్ట్ చేస్తాడు. అప్పటి వరకు శ్రీవాస్ బాలయ్య కోసం వెయిట్ చేస్తాడట.

సంబంధిత సమాచారం :