‘రాకా’లోకి మరో భామ రాక.. ఎవరంటే..?

‘రాకా’లోకి మరో భామ రాక.. ఎవరంటే..?

Published on Aug 24, 2026 7:19 PM IST

raaka

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం ‘రాకా’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే దీపికా పదుకొనే ప్రధాన హీరోయిన్‌గా నటిస్తుండగా, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తాజాగా ఈ భారీ తారాగణంలోకి మలయాళ, తమిళ చిత్రాల నటి ఐశ్వర్య లక్ష్మి కూడా చేరనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనుందని, అయితే దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర తదుపరి షెడ్యూల్‌లో ఐశ్వర్య లక్ష్మి కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాకతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకుంటున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు