హిందీలోకి రీమేక్ కానున్న మరొక తెలుగు సినిమా

Published on Jul 26, 2019 1:15 am IST

ప్రస్తుతం బాలీవుడ్ నిర్మాతల కను తెలుగు సినిమాలపై పడింది. ఈమధ్య ఇక్కడ హిట్టైన సినిమాలని హిందీలోకి రీమేక్ చేయడానికి ఉత్సాహం చూపుతున్నాయి అక్కడి నిర్మాణ సంస్థలు. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించడంతో ఇంకొన్ని తెలుగు సినిమాల హక్కుల్ని హిందీ నిర్మాతలు కొనిపెట్టుకున్నారు.

వాటిలో ‘జెర్సీ, ఆర్ఎక్స్100’ ఉండగా ఇంకా విడుడలకాని ‘డియర్ కామ్రేడ్’ను కూడా కొనేశారు. ఇక తాజా సమాచారం మేరకు మరొక తెలుగు చిత్రాన్ని కూడా హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. అది కూడా రీసెంట్ హిట్ చిత్రమని తెలుస్తోంది. అయితే ఆ చిత్రం ఏమిటనేది మాత్రం ఇంకా బయటికిరాలేదు. కొందరు నాగ చైతన్య చేసిన ‘మజిలీ’ అంటుంటే ఇంకొందరు దేవరకొండ చేసిన ‘గీత గోవిందం’ అంటున్నారు. మరి పక్కా సమాచారం తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :