లేటెస్ట్ బజ్..బాలయ్య నెక్స్ట్ కి కూడా అతడే.!

Published on May 22, 2021 2:00 pm IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీనుతో “అఖండ” అనే భారీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిపోయింది. ఇక ఈ సినిమా లైన్ లో ఉండగానే బాలయ్య మరో హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేని తో ఓ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సంబంధించే గత కొన్ని రోజులు నుంచి మంచి టాక్స్ నడుస్తున్నాయి.

వాటి ప్రకారం మరో బజ్ ఇప్పుడు బయటకి వచ్చింది. ఇప్పుడు బాలయ్య చేస్తున్న అఖండ కు ఎవరైతే సంగీతం అందిస్తున్నారో అదే మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ నే గోపీచంద్ తో సినిమాకు కూడా సంగీతం ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇది వరకే థమన్ గోపీచంద్ లాస్ట్ చిత్రం “క్రాక్” కు అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ సారి ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :