“పుష్ప” పై మరో ఇంట్రెస్టింగ్ గాసిప్.!

Published on May 12, 2021 10:32 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ అండ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప” కోసమే గత కొన్ని రోజుల నుంచి హాట్ టాపిక్స్ నసుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఈసారి కూడా మరిన్ని ఆసక్తికర వార్తలు ఇపుడు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యన రివీల్ కాబడిన అతి పెద్ద న్యూస్ పుష్ప ఒక్క సినిమాగా కాకుండా రెండు భాగాలుగా వస్తుంది అని తెలిసింది. మరి ఈ రెండో పార్ట్ కు సంబందించే ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది.

ఈ చిత్రంలో మళయాళ విలక్షణ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ పవర్ ఫుల్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి తన రోల్ పైనే ఈ లేటెస్ట్ గాసిప్ ఫహద్ రోల్ ఫస్ట్ పార్ట్ లో కంటే సెకండ్ పార్ట్ లోనే ఎక్కువ ఉంటుందట అంతే కాకుండా ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో సెకండ్ పార్ట్ బిగినింగ్ లా తన రోల్ ఉంటుందని తెలుస్తుంది.

అలాగే సెకండ్ పార్ట్ కు సంబంధించి కూడా ఆల్రెడీ కొంత మేర షూట్ కంప్లీట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం పుష్ప ను సాలిడ్ గా ప్రెజెంట్ చెయ్యడానికి సన్నద్ధం చేస్తున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రాల విడుదల కోసమే ఎదురు చూడటం తరువాయి.

సంబంధిత సమాచారం :