“శశి”లో ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందట.!

Published on Mar 18, 2021 10:00 am IST

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో అత్యవసరంగా మంచి కొట్టాల్సి ఉన్న హీరోల్లో ఆది సాయికుమార్ కూడా ఒకడు. మరి ఇప్పుడు ఆది హీరోగా పురాణిక్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “శశి”తో తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి రెడీగా ఉన్నాడు. శ్రీనివాస్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి వచ్చిన “ఒకే ఒక లోకం నువ్వే” సాంగ్ ఈ మధ్య కాలంలో భారీ హిట్ కూడా అయ్యింది.

మరి ఈ సినిమా విడుదల సందర్భంగా ఆది ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఇంట్రెస్టింగ్ అంశాన్ని కూడా రివీల్ చేసారు. తమ సినిమా టైటిల్ ను హీరోయిన్ రోల్ పైనే పెట్టామని అలాగే ఇదే పేరు ఈ చిత్రంలో ఇంకో కోణానికి కూడా లింకప్ అయ్యి ఉంటుంది అని అదేంటో తెలియాలి అంటే ఈ సినిమాలో చూడాల్సిందే అని ఆది కాస్త ఆసక్తి రేపాడు. మరి ఆ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలియాలి అంటే రేపు సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :