“ఆచార్య” షూట్ పై మరో ఇంట్రెస్టింగ్ టాక్.!

Published on Jul 7, 2021 4:15 pm IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య” షూట్ ఈరోజే మొదలైన సంగతి తెలిసిందే. ఇంకా కొన్ని రోజులు షూట్ మాత్రమే బ్యాలన్స్ ఉంచుకున్న ఈ చిత్రం ఈరోజే హైదరాబాద్ లో మొదలైంది.

అయితే ఈ షూట్ లోనే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొని ఓ వారం రోజుల్లో తన పార్ట్ ని కంప్లీట్ చేసుకోనున్నాడని తెలిసింది. అయితే దీనిపైనే మరో ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. దాని ప్రకారం హైదరాబాద్ లోని ఈ సినిమా కోసం మరో భారీ సెట్టింగ్ ను వేసారట. అది కూడా ఒక గ్రామం సెట్ అన్నట్టు తెలుస్తుంది.

ఇందులో కీలక సన్నివేశాలను కొరటాల తెరకెక్కిస్తున్నారట. మరి ఇప్పటికే ఈ సినిమాలో సెట్ వర్క్స్ కే పెద్ద మొత్తంలో నిర్మాతలు వెచ్చించారని తెలిసింది. అవి ఎలా ఉన్నాయో కూడా మెగాస్టార్ అండ్ సినిమా టీజర్ లో చూపించారు. మరి ఈ సీన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

సంబంధిత సమాచారం :