“RRR” నుంచి మరో మోస్ట్ అవైటెడ్ అనౌన్స్మెంట్.!

“RRR” నుంచి మరో మోస్ట్ అవైటెడ్ అనౌన్స్మెంట్.!

Published on Jul 27, 2021 9:52 AM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” కోసం అందరికీ తెలిసిందే. మరి గత కొన్నాళ్ల నుంచి కూడా అదిరే అప్డేట్స్ మరియు అనౌన్సమెంట్స్ తో వస్తున్న ఈ చిత్రం నుంచి నిన్ననే ఆడియో రైట్స్ పరంగా కూడా భారీ అనౌన్సమెంట్ ని ప్రకటించగా ఇప్పుడు దానికి సంబంధించే మంచి మోస్ట్ అవైటెడ్ అప్డేట్ ఈ చిత్రంపై వస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేసారు.

మొత్తం 5 భాషలు 5 మంది ఫైనెస్ట్ సింగర్స్ తో ఈ భారీ చిత్రం థీమ్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేసారు. మరి దానిని ఎప్పుడు విడుదల చేస్తారో అన్నది ఈరోజు ఉదయం 11 గంటలకి తెలుపనున్నట్టు చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేశారు. మరి ఇప్పటికే ఈ భారీ ప్రమోషనల్ సాంగ్ కి గాను విశాలమైన సెట్టింగ్స్ వేసి ప్లాన్ చేసారు. దానిని ఈ ఫ్రెండ్షిప్ డే కి రిలీజ్ చేస్తారన్న టాక్ ఉంది. మరి ఆ డేట్ కే వస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు