వైరల్ అవుతోన్న పవన్ – త్రివిక్రమ్ ల ఫోటో!

Published on Jul 30, 2021 11:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మరోమారు నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. రానా దగ్గుపాటి మరియు పవన్ కళ్యాణ్ లు ఇద్దరు కలిసి ప్రొడక్షన్ నెంబర్ 12 చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. అయితే ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పాత్ర లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో సైతం విడుదల అయి ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే తాజాగా మరొక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

పవన్ కళ్యాణ్ రానా చిత్రానికి త్రివిక్రమ్ మాటలు రాస్తున్న సంగతి తెలిసిందే. అయితే సెట్స్ లో త్రివిక్రమ్ మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.పవన్ కళ్యాణ్ చేతిలో టీ గ్లాస్ తో పోలీస్ డ్రెస్ లో ఉండగా, త్రివిక్రమ్ తో ముచ్చటిస్తూ ఉన్న ఫోటో ఇది. ఈ చిత్రం లో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ను వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :