చితి నుండి లేచొచ్చిన ‘సాహో’ విలన్ని చూశారా?

Published on Aug 7, 2019 1:28 pm IST

కొద్దీ రోజులుగా వరుస అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు సాహో టీమ్. ఇప్పటికే మూవీలోని ప్రధాన విలన్ నీల్ నితిన్ ముఖేష్ లుక్ ని విడుదల చేసిన చిత్ర యూనిట్ నిన్న మరో విలన్ అరుణ్ విజయ్ లుక్ ని విడుదల చేశారు.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ప్రతి విలన్ ని పరిచయం చేస్తున్న పోస్టర్ లో డీప్ మీనింగ్ తో ఓ కొటేషన్ పెడుతున్నారు. నీల్ నితిన్ పోస్టర్ లో “అంతం అన్నిటికీ సమాధానం కాదు” (ది ఎండ్ డస్ నాట్ ఆన్సర్ ఎవ్రీథింగ్)అనే సీరియస్ లైన్ ఉండగా, నిన్న విడుదల చేసిన అరుణ్ విజయ్ పోస్టర్ లో యుద్దానికి ఆహ్వానం అవసరం లేదు (బ్లడ్ డస్ నాట్ నీడ్ బ్లడీ ఇన్విటేషన్)అనే డేంజరస్ కోట్ ఉండటం గమనార్హం.

కాగా నేడు కొద్దిసేపటి క్రితం మరో విలన్ పాత్ర చేస్తున్న చుంకీ పాండే లుక్ ని రివీల్ చేశారు. మిగతా ఇద్దరు విలన్స్ సోలో గా దర్శన మివ్వగా, చుంకీ పాండే మాత్రం గ్యాంగ్ తో వచ్చాడు. ఖరీదైన కోటు, చేతిలో సిగార్ తో కిల్లర్ లుక్స్ తో అదిరిపోతున్నాడు. మిగతా ఇద్దరిలాగే ఈ విలన్ కి “చితి నుండి లేచొచ్చాడు” (రైజన్ ప్రమ్ యాషెస్) అనే ఓ ఇంట్రెస్టింగ్ లైన్ యాడ్ చేశారు.

సంబంధిత సమాచారం :