ఓటిటిలో సూర్య సినిమా ట్రూ బ్లాక్ బస్టర్ అనడానికి ఇదో ప్రూఫ్!

ఓటిటిలో సూర్య సినిమా ట్రూ బ్లాక్ బస్టర్ అనడానికి ఇదో ప్రూఫ్!

Published on Dec 18, 2020 4:00 PM IST

akasam nee haddura

మన దక్షిణాదిలో తెలుగు మరియు తమిళ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ స్టార్ హీరోల్లో సూర్య ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. అయితే గత కొంత కాలం నుంచి సూర్యకు సరైన లేకపోవడంతో అతడు ఒక సాలిడ్ హిట్ కొడితే చూడాలి అనుకున్నారు చాలా మంది. కానీ దానికి కూడా కరోనా బ్రేక్ వేసింది. అయినప్పటికీ ఓటిటిలో విడుదల చేసి యూనానిమాస్ విజయాన్ని నమోదు చేసుకున్నారు.

తాను నటించిన లేటెస్ట్ చిత్రం “ఆకాశం నీ హద్దురా” రెండు భాషల్లో అమెజాన్ ప్రైమ్ లోని విడుదలయ్యి భారీ స్థాయి రెస్పాన్స్ ను అందుకుంది. జస్ట్ ఒక నెలన్నర కితం విడుదల కాబడిన ఈ చిత్రం ఈ ఏడాది ఓటిటిలో అత్యధికంగా చూసిన ఇండియన్ సినిమాల్లో రెండవ చిత్రంగా నిలిచిందట. మరి ఇది చాలదా ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో చెప్పడానికి, ఇంకా అలాగే ఇదే సినిమా గూగుల్ లో కూడా సెన్సేషన్ ను నమోదు చేసింది.

గూగుల్ లో మోస్ట్ సెర్చెడ్ ఇండియన్ సినిమాల లిస్ట్ లో కూడా రెండవ స్థానంలో ఈ చిత్రం నిలిచింది. మొత్తానికి మాత్రం సూర్య మరియు సుధా కొంగరల కాంబోలో వచ్చిన ఈ ఇన్స్పైరింగ్ ఎమోషనల్ డ్రామా ఒక ట్రూ ఓటిటి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు.అయితే ఈ లిస్ట్ లో మొదటి స్థానాన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ నటించిన లాస్ట్ చిత్రం “దిల్ బెచారా” నిలిచింది.

https://www.instagram.com/p/CI7QEx5p4CI/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు