ఆస్కార్స్ అకాడమీలో సూర్య “జై భీమ్” లోని సీన్..!

Published on Jan 18, 2022 11:15 am IST


కోలీవుడ్ స్టార్ నటులలో ఒకరైన హీరో సూర్య తన కెరీర్ లోనే ది బెస్ట్ బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను చేసి దేశమే గర్వించే విధంగా చేసారు. ఆ సినిమాలే ఆకాశం “నీ హద్దురా” మరియు “జై భీమ్”. తమిళ్ మరియు తెలుగు భాషల్లో రెండు కూడా ఓటిటి లోనే రిలీజ్ అయ్యినా భారీ హిట్స్ గా నిలవడమే కాకుండా భారతీయ సినిమాని గర్వించదగ్గ సినిమాలుగా నిలిచాయి.

అయితే ఇదిలా ఉండగా వాటిలో “జై భీమ్” చిత్రం కోసం కూడా మళ్ళీ అంతర్జాతీయ సినిమా దగ్గర చర్చకు రావడం ఆసక్తిగా మారగా ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఈ సినిమాలో ఒక 12 నిమిషాల మేర ఉండే కీలక సన్నివేశాన్ని ప్రపంచ ప్రఖ్యాత అవార్డు సంస్థ అయినటువంటి ఆస్కార్స్ యూట్యూబ్ ఛానెల్ వారు ప్రసారం చేశారు.

ఇది ఇప్పటి వరకు ఏ తమిళ్ సినిమాకి కూడా జరగలేదని తెలుస్తుంది. ఆస్కార్ అకాడమీలో సీన్ ఇది అన్నట్టుగా దీనిని వారు ప్రసారం చేసారు. దీనితో సూర్య అభిమానులు మరింత గర్వం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఒక్క వారికే కాకుండా ఇండియన్ సినిమా అంతటికీ కూడా గర్వ కారణమే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :