బన్నీ ఖాతాలో మరో రేర్ రికార్డ్ పడింది.!

Published on Nov 24, 2020 1:00 pm IST

కొన్ని గంటల కితమే అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో” బుట్ట బొమ్మ సాంగ్ రికార్డు స్థాయి వ్యూస్ తో సెన్సేషన్ సృష్టించింది. 450 మిలియన్ వ్యూస్ తో మన సౌత్ ఇండియాలో రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు ఇదే సినిమా నుంచి మరో ట్రెండ్ సెట్టింగ్ సాంగ్ అయినటువంటి మాస్ బీట్ “రాములో రాముల” మరో రేర్ ఫీట్ ను అందుకున్నట్టు తెలుస్తుంది.

ఈ పాట రెండు వెర్షన్లు అంటే లిరికల్ అండ్ ఫుల్ వీడియో సాంగ్ కూడా 250 మిలియన్ వ్యూస్ అందుకొని మన దక్షిణాదిలోనే మొట్ట మొదటి సాంగ్ నిలిచి మరో రేర్ రికార్డుగా నిలిచింది. దీనితో ఇలాంటి రికార్డు ఉన్న హీరోగా బన్నీ నిలిచాడు. మొత్తానికి మాత్రం త్రివిక్రమ్, థమన్, అల్లు అర్జున్ ల కాంబో మన టాలీవుడ్ లో పెద్ద సంచలనమే సృష్టించింది. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న “పుష్ప”పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :

More