తారక్ డై హార్డ్ ఫ్యాన్ లిస్ట్ లో మరో సీనియర్ నటి.!

Published on Aug 11, 2021 9:00 am IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మన దగ్గర మాస్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తన క్రేజ్ ఏపాటితో తన డే 1 రికార్డులే చెబుతాయి. మరి అలాగే జెనరల్ ఆడియెన్స్ లోనే కాకుండా సినీ తారల్లో కూడా తారక్ కి అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా అయితే తారక్ కి సీనియర్ నటుల్లో ఫిమేల్ ఫాలోయింగ్ అయితే ఒకింత ఎక్కువే..

ఆ మధ్య నటి ఖుష్బూ అలాగే మరో సీనియర్ నటి అర్చన లు ఈటీవీ ఎంటర్టైనింగ్ షో “ఆలీతో సరదాగా” లో తాము తారక్ నతనికి చాలా పెద్ద అభిమానులం అని మరో స్థాయిలో కొనియాడారు. మరి ఇప్పుడు ఇదే షో స్టేజ్ నుంచి తారక్ అభిమానుల లిస్ట్ లో మరో సీనియర్ నటి వనిత తారక్ పై తనకున్న అభిమానం కోసం చెప్పారు.

‘దేవి’ సినిమాలో అద్భుతమైన పాత్ర పోషించిన ఈమె లేటెస్ట్ గా పాల్గొన్న షో ప్రోమో ద్వారా ఈ విషయం బయటకి వచ్చింది. సీనియర్ హీరోల్లో అయితే తాను నాగార్జున కి పెద్ద ఫ్యాన్ ని అని కానీ ఇప్పుడు హీరోస్ లో అయితే తారక్ కి చాలా పెద్ద అభిమానిని అని జస్ట్ తారక్ తో ఒక్క షాట్ లో అయినా నటిస్తే చాలు అదే తనకి పెద్ద డ్రీం అని చాలా ఎగ్జైటింగ్ గా ఆమె తెలిపారు.

దీనితో ఒకే షో ఒకే స్టేజ్ నుంచి మరో డై హార్డ్ సీనియర్ ఫ్యాన్ తారక్ కి దొరికారాని చెప్పాలి. మరి ఈ ఎపిసోడ్ లో ఆమె ఎలాంటి విషయాలు పంచుకున్నారో తెలియాలంటే వచ్చే ఆగస్ట్ 16 సోమవారం రాత్రి 9:30 నిమిషాలకి టెలికాస్ట్ కానున్న ఈ షో చూడాల్సిందే. మరి ప్రస్తుతం తారక్ రాజమౌళితో చేస్తున్న “RRR” సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :