పవర్ స్టార్ మరో సాలిడ్ కాంబో సెట్ చేయనున్నాడా.?

Published on Jun 8, 2021 11:02 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” తో చాలా కాలం అనంతరం మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. మరి ఆ సాలిడ్ రీఎంట్రీ తోనే మరిన్ని ప్రాజెక్ట్ లు జెట్ స్పీడ్ తో ఓకే చేసేసి ఎప్పుడు లేని విధంగా సినిమాలు చేసేస్తున్నారు. అలా ఇప్పుడు చేతిలో నాలుగు సినిమాలు ఉండగా అవి కాకుండా పవన్ నుంచి మరో సాలిడ్ ప్రాజెక్ట్ సెట్ అవ్వనున్నట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ఇది వరకే స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబోలో సినిమాపై ఆ మధ్య బజ్ వినిపించింది. ఇప్పుడు కూడా మళ్ళీ వంశీ పేరు సహా క్లాస్ సినిమాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పేరు కూడా ఉందట. మరి మరి ఈ సరికొత్త కాంబోస్ పవన్ ఏ స్టార్ దర్శకుని దర్శకత్వంలో నటిస్తారో చూడాలి. ప్రస్తుతానికి అయితే పవన్ పాన్ ఇండియన్ చిత్రం “హరిహర వీరమల్లు”, అలాగే “అయ్యప్పణం కోషియం” రీమేక్ చిత్రాల్లో ఏకకాలంలో నటించడానికి సన్నద్ధం అవుతున్నారు.

సంబంధిత సమాచారం :