బాలయ్య నుంచి మరో సాలిడ్ ఫీస్ట్ అప్పుడే.!

Published on May 22, 2021 12:02 pm IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ తన హ్యాట్రిక్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో “అఖండ” అనే సాలిడ్ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆల్ మోస్ట్ షూట్ కంప్లీట్ కాబడిన ఈ చిత్రం ఇంకో 20 రోజుల మేర షూట్ మిగిలి ఉంది. అయితే ఈ సినిమా పరంగా మాత్రం మేకర్స్ నందమూరి అభిమానులను ఎప్పుడు నిరాశ పరచలేదు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఫుల్ ఖుషి చేస్తున్నారు.

అయితే ఈ నెలాఖరున ఫస్ట్ సింగిల్ వస్తుందని టాక్ ఉంది కానీ అప్పుడు ఏమో కానీ వచ్చే నెలలో మాత్రం స్యూర్ షాట్ సాలిడ్ అప్డేట్ కన్ఫర్మ్ అని తెలుస్తుంది. ఇంతకీ అంత స్పెషల్ ఏంటి అంటే వచ్చే నెలలోనే 10వ తారీఖున బాలయ్య పుట్టినరోజు ఉంది. సో గత ఏడాది ఎలా అయితే అదిరే ఫీస్ట్ ను మేకర్స్ ఇచ్చారో ఈసారి అంతకు మించే ఇస్తారు అని చెప్పొచ్చు. మరి ఈ రెండు అప్డేట్స్ ఈ గ్యాప్ లో వస్తాయేమో చూడాలి.

సంబంధిత సమాచారం :