బాలీవుడ్ లో రీమేక్ కానున్న మరో తెలుగు సినిమా ?

బాలీవుడ్ లో రీమేక్ కానున్న మరో తెలుగు సినిమా ?

Published on Apr 26, 2020 10:45 PM IST

Ismart Shankar

టాలీవుడ్ లో హిట్టైన సినిమాలని హిందీలోకి రీమేక్ చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు గత కొన్ని సంవత్సరాలుగా బాగా ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించడంతో.. తెలుగులో హిట్ అయిన ‘జెర్సీ, ఆర్ఎక్స్100’ ‘ఎవడు’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల రైట్స్ ను కొనేశారు. కాగా మరొక తెలుగు సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ కూడా హిందీలోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి, ఇస్మార్ట్ శంకర్ పూరికి మరియు హీరో రామ్ కి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది, మరి రణబీర్ కపూర్ కి కూడా సూపర్ హిట్ ని ఇస్తుందా..? అలాగే రామ్ పాత్రలో రణబీర్ కపూర్ ఎలా నటిస్తాడో చూడాలి. అక్టోబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందట. ఇక బాలీవుడ్ లో మరో తెలుగు సినిమా కూడా రీమేక్ కానుంది. నాని నిర్మించిన ‘హిట్’ మూవీ కూడా రీమేక్ కానుందట. నిజానికి ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అందుకే హిందీలోకి కూడా రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారట ‘కబీర్ సింగ్’ సినిమా నిర్మాతలు.

తాజా వార్తలు