కొత్త స్ట్రీమింగ్ యాప్ లోకి రెడీగా ఉన్న థ్రిల్లర్ “మాస్క్”

Published on Oct 21, 2020 8:15 pm IST

ఇపుడు ప్రపంచం అంతా డిజిటల్ వరల్డ్ గా మారిపోయింది. ఎంటెర్టైన్మెంట్ రంగంలో స్ట్రీమింగ్ సంస్థల నడుమ నెలకొన్న పోటీలో సరికొత్త యాప్స్ కూడా వస్తున్నాయి. అలా మన తెలుగులో ఇప్పటికే “ఆహా” ఉంది. ఇపుడు దాని తర్వాత లాంచ్ కావడానికి రెడీగా ఉన్న మరో స్ట్రీమింగ్ యాప్ “ఫిలిం”. తెలుగు సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఇతర కంటెంట్ తో లాంచ్ కు రెడీగా ఉన్న ఈ యాప్ లో స్ట్రీమింగ్ లైన్ లో పలు ఆసక్తికర సినిమాలే ఉన్నాయి.

అలా డైరెక్ట్ స్ట్రీమింగ్ కు రెడీగా ఉన్న మరో చిత్రం “మాస్క్”. ఈ చిత్రం తాలూకా ట్రైలర్ విడుదల ద్వారా వారు తెలిపారు. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే “మాస్క్” చిత్రం మంచి క్రైమ్ థ్రిల్లర్ అన్నట్టుగా అర్ధం అవుతుంది. పోలీసులు మరియు ఒక చైన్ స్నాచింగ్ దొంగల నడుమ సాగే ఇంట్రెస్టింగ్ డ్రామాలా ఈ చిత్రం ఉండనున్నట్టు అర్ధం అవుతుంది.

ఆర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో ధృవ, సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి లు కీలక పాత్రల్లో నటిస్తుండగా ఐశ్వర్య దత్త మరియు శరణ్య పొన్నవన్న లు ఫీమేల్ లీడ్స్ లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఫిలిం యాప్ లో అతి త్వరలో స్ట్రీమింగ్ కు రానుంది.

సంబంధిత సమాచారం :

More