“పుష్ప” ఖాతాలో టాలీవుడ్ ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ రికార్డ్.!

“పుష్ప” ఖాతాలో టాలీవుడ్ ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్ రికార్డ్.!

Published on May 4, 2021 1:00 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ భారీ చిత్రం “పుష్ప”. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ సినిమాపై అంతే స్థాయి అంచనాలు కూడా నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ మధ్యనే బన్నీ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన లేటెస్ట్ టీజర్ ఎలాంటి రికార్డ్స్ సెట్ చేసిందో మనం చూసాము. మన తెలుగులో ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్డ్ టీజర్ నుంచి ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ టీజర్ వరకు భారీ రెస్పాన్స్ తో దుమ్ము లేపింది.

మరి ఇప్పుడు లేటెస్ట్ గా మరో ఫాస్టెస్ట్ అండ్ ఫస్ట్ సాలిడ్ రికార్డును పుష్ప చిత్రం ఖాతాలో వేసుకుంది. 60 మిలియన్ వ్యూస్ మరియు 1.4 మిలియన్ లైక్స్ తో పుష్ప టీజర్ మన టాలీవుడ్ లో మరో భారీ రికార్డును సెట్ చేసింది. దీనితో ఈ రెండిటిలో కూడా హైయెస్ట్ వీడియోగా ఇది ఆల్ టైం రికార్డ్ తో హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు