సేతుపతి వివాదంలో అండగా మరో సీనియర్ హీరోయిన్!

Published on Oct 21, 2020 8:35 am IST

క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్రపై తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఒప్పుకున్న చిత్రం “800”. ఈ చిత్రం అసలు ఊహించని విధంగా వివాదాల వైపుకు దారి తీసింది. సేతుపతి పేరు చెడిపోవడమే కాకుండా అతనికి కుటుంబానికి కూడా బెదిరింపులు వచ్చాయి.

దీనితో మురళీధరన్ కోరిక మేరకు విజయ్ సేతుపతి ఆ చిత్రం నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలోనే విజయ్ కు కోలీవుడ్ ప్రముఖ సీనియర్ హీరోయిన్ రాధికా అండగా నిలవగా ఇప్పుడు మరో సీనియర్ నటి అండగా నిలిచారు. సేతుపతి విషయంలో బాగా హర్ట్ అయిన అంశం సోషల్ మీడియాలో చోటు చేసుకున్న విషయం మాత్రం చాలా సీరియస్ అయ్యింది.

దీనిపై ఒకప్పటి టాప్ హీరోయిన్ ఖుష్బూ స్పందిస్తూ విజయ్ కు ధైర్యం చెప్పారు. విజయ్ నువ్వు బలమైన వ్యక్తివి ఎలా ఉండేవాడివో అలానే ఉండు, నీ కుటుంబానికి బెదిరింపులు ఇచ్చిన వాడిపై ఇన్వెస్టిగేషన్ అవుతుంది అతడు ఖచ్చితంగా దొరుకుతాడు కఠిన శిక్ష కూడా అనుభవిస్తాడు మేము నీతో ఉన్నామని సేతుపతికి ఆమె కూడా అండగా నిలిచారు.

సంబంధిత సమాచారం :

More