“RRR” నుంచి మరో అప్డేట్ వస్తుంది.!

“RRR” నుంచి మరో అప్డేట్ వస్తుంది.!

Published on Dec 1, 2020 9:00 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మన దేశంలోని అన్ని కీలక భాషల్లోనూ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న ఈ చిత్రంపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ అనంతరం శరవేగంగా కంప్లీట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ విషయంలో మాత్రం మేకర్స్ ఆడియెన్స్ కు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు. అలానే నిన్న ఒక మేజర్ షెడ్యూల్ ను పూర్తి చేసి దాని పై కూడా అప్డేట్ ఇచ్చారు. అయితే ఈరోజు ఇంకో షెడ్యూల్ కు సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ ను ఇవ్వనున్నట్టుగా మేకర్స్ తెలిపారు.

ఆ అప్డేట్ ను ఈరోజు ఏ సమయంలో అయినా రివీల్ చేయొచ్చు. మరి ఈసారి ప్లాన్ చేసిన షెడ్యూల్ ఎక్కడ ఉంటుందో చూడాలి. అలాగే ఈ చిత్రంలో తారక్ చేస్తున్న పాత్రకు నటిస్తున్న ఫిమేల్ లీడ్ ఈ ఈ కొత్త షెడ్యూల్ విషయంలో చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నానని చెబుతుంది. మరి జక్కన ఎలాంటి ఎపిసోడ్ ను ప్లాన్ చేసారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు