“సర్కారు వారి పాట” నుంచి మరో లీక్ వైరల్.!

Published on Jul 24, 2021 12:34 am IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా ఈ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ ఇప్పుడు కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేసుకుని శరవేగంగా ఈ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంటుంది. అయితే మరోపక్క ఈ చిత్రం నుంచి మళ్ళీ లీక్స్ బయటకి రావడం మేకర్స్ కి తల నొప్పిగా మారింది.

దానితో మేకర్స్ కూడా అధికారికంగా స్పందించాల్సి వచ్చింది. అయినా కూడా ఈ లీక్స్ ఆగనట్టు తెలుస్తుంది. ఈసారి ఒక మాస్ డైలాగ్ వీడియో లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ జోరుగా వైరల్ అవ్వడం హాట్ టాపిక్ అవుతుంది. దీనిని అభుమానులే కొందరు జోరుగా షేర్ చేసుకుంటున్నారు. మరి ఇలాంటి వాటి విషయంలో మేకర్స్ మరింత జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :