‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సెకండ్ ట్రైలర్.. మరింత ఘాటుగా

Published on Nov 20, 2019 8:07 pm IST

రామ్ గోపాల్ వర్మ తన ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ చిత్రం నుండి ఉదయం కొత్త ట్రైలర్ ఒకదాన్ని విడుదల చేశారు. ఇందులో మొదటి ట్రైలర్లో కంటే ఎక్కువ విషయాన్నే జొప్పించాడు వర్మ. ప్రధానమైన రెండు సామాజిక వర్గాల నడుమ సాగే ఆధిపత్య పోరుగా చిత్రాన్ని మలిచిన వర్మ అందులో అనేకమంది ప్రముఖుల్ని ప్రస్తావించి సినిమా మీద జనం ఫోకస్ పడేలా చూస్తున్నారు.

కొత్త ట్రైలర్లో వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్, లోకేష్ పాత్రల మీదే కాకుండా ఇంకొంతమంది ప్రముఖుల మీద కూడా సంచలన రీతిలో డైలాగ్స్ పేల్చాడు ఆర్జీవీ. పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేస్తే లాంటి డైలాగ్స్ చాలానే ఉన్నాయి అందులో. అంతేకాదు అసెంబ్లీలో ఇరు పార్టీల నడుమ జరిగిన తగాదాల్ని కూడా వాడేశాడు. మొత్తానికి కొత్త ట్రైలర్ తో పెద్ద హడావుడే చేశాడు.

ఈ ట్రైలర్ చూసిన నెటిజన్లు ట్రైలర్లోనే కంటెంట్ ఇలా ఉండే సినిమాలో ఇంకెంత రచ్చ ఉంటుందో అని కొందరంటే ఇంకొంతమంది మాత్రం ఇలాంటి సినిమాలు తగవని పెదవి విరుస్తున్నారు. ఏది ఏమైనా వర్మ మాత్రం తనకు కావల్సిన పబ్లిసిటీని క్రియేట్ చేసుకుంటున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

More