27న ప్రేమకథతో వస్తున్న ఏఎన్నార్ మనవడు !

Published on Jul 10, 2018 2:12 pm IST

హీరో రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో సుశాంత్ హీరోగా ‘చి ల సౌ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం జూలై 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్‌ ‘చి ల సౌ’ చిత్రాన్ని విడుదల చేస్తోంది.

కాగా ఈ చిత్రంలో సుశాంత్ సరసన కొత్త హీరోయిన్ రుహానీ శర్మ నటిస్తోంది. సెన్స్ బుల్ లవ్ స్టోరీతో హృదయానికి హత్తుకున్నేలా ఈ చిత్రం రుపొందిందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సిరుని సినీ కార్పొరేషన్‌ బ్యానర్ పై జస్వంత్‌ నడిపల్లి, భరత్‌ కుమార్‌, హరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం :