“అంత ఇష్టం” సాంగ్ ను ఇష్టంగా పాడిన ఆమె…సోషల్ మీడియాలో వైరల్!

Published on Mar 6, 2022 9:32 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి లు ప్రధాన పాత్రల్లో నటించిన భీమ్లా నాయక్ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన అంత ఇష్టం పాట కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ పాటను జ్యోతి అనే మహిళ పాడటం జరిగింది. ఆమె పాడిన ఈ అంత ఇష్టం పాట కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

జ్యోతి పాడిన పాటకి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ తో పాటుగా, పలువురు ప్రముఖులు స్పందిస్తూ, ఆమెను అభినందించారు. అయితే ఈ అంత ఇష్టం సాంగ్ భీమ్లా నాయక్ సినిమా నుండి తొలగించిన సంగతి అందరికీ తెలిసిందే. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా, థమన్ సంగీతం అందించడం జరిగింది.

సంబంధిత సమాచారం :