టీజర్ తో అంచనాలను పెంచేసిన అంతరిక్షం !

Published on Oct 17, 2018 4:34 pm IST

‘ఫిదా, తొలిప్రేమ’ చిత్రాల రూపంలో వరుస విజయాలను అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘అంతరిక్షం 9000 కెఎమ్ పిహెచ్’. స్పెస్ థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రంలో వరుణ్ వ్యోమగామి పాత్రలో నటించాడు. ఇక ఈ రోజు ఈచిత్రం యొక్క టీజర్ ను విడుదలచేశారు. ఇక టీజర్ చూస్తుంటే ఈచిత్రం తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలిగించడం ఖాయం గా కనిపిస్తుంది. ఈటీజర్ తో ప్రేక్షకుల్లో ఈసినిమా ఫై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

లావణ్య త్రిపాఠి , అదితి రావ్ హైదరి కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈచిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :