ఇంటర్వ్యూ : అనుపమ పరమేశ్వరన్ – ‘రాక్షసుడు’ స్క్రిప్ట్ అద్భుతంగా ఉంటుంది !

Published on Jul 25, 2019 4:17 pm IST

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “రాక్షసుడు”. తమిళంతో విజయవంతమైన “రాక్షసన్” చిత్రానికి తెలుగు రీమేక్ గా తెరకెక్కింది ఈ చిత్రం. స్కూల్ కి వెళ్లే టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసే వారి ప్రాణాలు తీసే సైకో కిల్లర్ కథాంశంతో క్రైమ్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమా ఆగష్టు 2న రిలీజ్ కానుంది. కాగా అనుపమ పరమేశ్వరన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సినిమా గురించి అనుపమ పరమేశ్వరన్ వెల్లడించిన పలు ఆసక్తికర విశేషాలు మీ కోసం….

 

రాక్షసుడు సినిమా గురించి ?

 

తమిళ్ “రాక్షసన్” సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ ‘రాక్షసుడు’ వస్తోంది. ముందుగా ఈ స్క్రిప్ట్ చాల అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్.. సినిమాలో థ్రిల్లింగ్ అంశాలు హైలెట్ గా ఉంటాయి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

 

సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి ?

 

ఈ సినిమాలో టీచర్ క్యారెక్టర్ లో కనిపిస్తాను. నేనింత వరకూ ఇలాంటి క్యారెక్టర్ చెయ్యలేదు. టీచర్ గా చెయ్యటానికి.. టీచర్ లా కనిపించడానికి చాల జాగ్రత్తలు తీసుకున్నాను. మరి రేపు సినిమాలో నన్ను చూసి ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారో అనే టెన్షన్ కూడా ఉంది.

 

“రాక్షసన్” సినిమాలో అమలా పాల్ చేసిన పాత్రను మీరు చేశారు. ఎలా అనిపిస్తోంది ?

 

అమలా పాల్ అంటే నాకు చాలా బాగా ఇష్టం అండి. ఇక తను చేసిన రోల్ ను నేను చేయడం హ్యాపీగా అనిపించింది. అయితే తనలా యాక్ట్ చెయ్యటానికి నేను ఎక్కడా ట్రై చెయ్యలేదు. ఆ పాత్రలో నా వరకూ నేను సహజంగా నటించడానికి ట్రే చేశాను.

 

ఈ సినిమాకి మీరే డబ్బింగ్ చెప్పారా ?

 

నేనే చెప్పాను. కానీ డబ్బింగ్ చెప్పే సమయంలో నిజానికి నా వాయిస్ అసలు బాగాలేదు. డైరెక్టర్ గారికి చెప్పాను. ప్రజెంట్ వాయిస్ బాగాలేదు వేరే ఎవరి చేతైనా చెప్పించండి అంటే .. లేదూ నేనే చెప్పాలి అని రమేష్ వర్మగారు పట్టుబడితే అప్పుడు నేను చెప్పాను.

 

అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారా ?

 

అవును. ఓ మలయాళ సినిమాకి పని చేశాను. అసిస్టెంట్ గా పని చేస్తోన్నప్పుడు నిజంగా అసిస్టెంట్ గానే పనిచేసేదాన్ని. ఎలాంటి ఫెసిలిటీస్ ఉండేవి కాదు. అయినా డైరెక్షన్ అంటే ఫ్యాషన్. అందుకే అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాను.

 

మరి భవిష్యత్తులో మిమ్మల్ని డైరెక్టర్ గా చూడొచ్చా ?

 

తప్పకుండా డైరెక్షన్ చేస్తాను. కొన్ని ఐడియాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం యాక్టింగ్ పైనే నా దృష్టి అంతా ఉంది.

 

మీరు సౌత్ అన్ని భాషల్లో నటిస్తున్నారు ? ఏ భాషలో మీకు ఎక్కువుగా కంఫక్ట్ ఫీల్ అవుతారు ?

 

తెలుగులో మలయాళంలోనే నేను ఎక్కువ సినిమాలు చేశాను. కన్నడలో ఒక సినిమా అండ్ తమిళ్ లో ఒక సినిమా మాత్రమే చేశాను. బేసిగ్గా మలయాళం అండ్ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేశాను కాబట్టి.. ఇక్కడే నాకు ఎక్కువుగా కంఫక్ట్ ఉంటుంది.

 

మీ తదుపరి సినిమాల గురించి ?

 

ప్రస్తుతం ‘నిన్ను కోరి’ తమిళ్ రీమేక్ లో నటిస్తున్నాను. అలాగే తెలుగులో కూడా రెండు కథలు ఉన్నాయి. ఇంకా ఫైనల్ కాలేదు. ప్రెజెంట్ అయితే రాక్షసుడు సినిమా రిలీజ్ కోసమే ఎంతో ఆసక్తిగా ఉన్నాను.

సంబంధిత సమాచారం :

More