లవ్ బ్రేకప్‌ పై ఓపెన్ అయిన క్రేజీ హీరోయిన్ !

Published on Jul 10, 2021 7:58 pm IST

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌ గా ఉంటుంది. ఈ క్రమంలో అనుపమ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజనులతో చాట్ చేసింది. అయితే ఈ ముచ్చట్లు సందర్భంగా ఆమె ఫాలోవర్స్ అడిగిన పలు ప్రశ్నలకు, అనుపమ సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలో ఓ నెటిజన్.. ‘మీ జీవితంలో నిజమైన ప్రేమ ఉందా ?’ అని అడిగాడు.

అతని ప్రశ్నకు అనుపమ సమాధానం చెబుతూ ‘నేను గతంలో ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించాను. కానీ, కొన్ని కారణాల వల్ల అతనితో నాకు బ్రేకప్‌ అయిందని అనుపమ చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరూ అంటూ నెటిజన్ అడిగినా, అతను ఎవరు అన్నది మాత్రం ఆమె చెప్పలేదు. అయితే గతంలో క్రికెటర్‌ బుమ్రాతో అనుపమ ప్రేమాయణం నడిపిందని ఆ మధ్య రూమర్స్ వినిపించాయి.

అయితే, బుమ్రా టీవీ యాంకర్‌ సంజనను పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో అనుపమ సాడ్‌ సాంగ్స్‌ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సాడ్ లవ్ కొటేషన్స్ ను కూడా పోస్ట్ చేసింది.

సంబంధిత సమాచారం :