వైరల్ గా మారిన బేబీ అనుపమ పరమేశ్వరన్ క్యూట్ పిక్స్

వైరల్ గా మారిన బేబీ అనుపమ పరమేశ్వరన్ క్యూట్ పిక్స్

Published on Dec 19, 2019 11:09 PM IST

Anupama Parameswaran

మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ప్రేమమ్ తో వెండితెరకు పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో చాలా సినిమాలు చేశారు. ఎక్స్ పోజింగ్ కి దూరంగా అనుపమ పరమేశ్వరన్ యంగ్ హీరోల ప్రక్కన ప్రేయసి పాత్రలు చేశారు. ఈ ఏడాది ఆమె సాయి శ్రీనివాస్ సరసన రాక్షసుడు చిత్రంలో నటించారు. తమిళ చిత్రం రాక్షసన్ కి తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది.

అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియా వేదికగా తన చిన్ననాటి ఫోటోలు పంచుకున్నారు. చిన్నారి ప్రాయంలో ఉన్న అనుపమ చాలా ముద్దుగా ఉన్నారు. ముఖ్యంగా ఒక ఫొటోలో అనుపమ చిన్న శారీ.. మెడలో దండలు, పూలు పెట్టుకొని ఏదో వేషధారణలో ఉన్న ఫోటో ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనుపమకు ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. ఆమె ప్రస్తుతం ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్నారు.

తాజా వార్తలు