‘సైలెన్స్’అంటున్న అనుష్క !

Anushka

‘బాహుబలి’ తరువాత ‘భాగమతి’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది హీరోయిన్ అనుష్క . ఇక ఈ సినిమా తరువాత ఆమె కొత్త తరహా చిత్రాలలో నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. దాంట్లో భాగంగా కొంచం విరామం తీసుకొని ప్రస్తుతం తెలుగులోమాధవన్ తో కలిసి నటిస్తున్నారు.

థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి ‘సైలెన్స్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ తోనే ఆసక్తిని క్రియేట్ చేస్తున్న ఈ చిత్రాన్ని హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రేక్షకులముందుకు వచ్చే అవకాశాలు వున్నాయి.

Exit mobile version