అనుష్క పెర్ఫామెన్సే హైలెట్ అవుతుందట !

అనుష్క పెర్ఫామెన్సే హైలెట్ అవుతుందట !

Published on Mar 24, 2019 9:26 PM IST

‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ని అందుకున్న అనుష్క.. ఆ తరువాత చాలా రోజులు విరామం తీసుకుని ‘సైలెన్స్’ అనే సినిమాలో నటించడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ నెలలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

కాగా ఈ చిత్రంలో అనుష్కతో పాటు మాధవన్, సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. అయితే సినిమా పేరు సైలెన్స్ అయినా.. సినిమాలో మ్యాటర్ మాత్రం చాలా వైలెంట్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో అనుష్క పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట. ‘అరుంధతి, భాగమతి’ తరహా చిత్రాలు లాగానే ఈ సినిమాలో కూడా అనుష్క పెర్ఫామెన్స్ నే హైలెట్ కానుందని సమాచారం.

పైగా అనుష్క ఈ చిత్రంలో బాగా వైలెంట్ క్యారెక్టర్ లో నటిస్తోందట. మరి ఈ చిత్రం కూడా అనుష్క కెరీర్ లో మరో భారీ విజయంగా నిలిచిపోతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు