అనుష్కకు ఆఫర్లేమీ తగ్గలేదన్నమాట

Published on May 12, 2021 11:55 pm IST

తెలుగు స్టార్ హీరోయిన్లలో అనుష్క స్థాయి ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఆమెతో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు, నిర్మాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే స్వీటీ మాత్రం సినిమాల విషయంలో అంత త్వరపడటం లేదు. తన వద్దకు వచ్చిన అనేక ఆఫర్లలో ఆమె ఓకే చేసింది యువీ క్రియేషన్స్ సినిమాను మాత్రమే. ఈపాటికే మొదలుకావాల్సిన ఈ చిత్రం పలు కారణాల వలన వాయిదాపడుతూ వచ్చింది. తాజాగా సెకండ్ వేవ్ కరోనాతో ఇంకాస్త ఆలస్యం అయ్యేలా ఉంది. ఇక అనుష్క వద్దకు భారీ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుండి కూడ ఆఫర్ వెళ్ళిందట.

ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న డైరెక్టర్ ఒకరు అనుష్క కోసం లేడీ ఓరియెంటెడ్ స్టోరీ ఒకటి సిద్ధం చేసుకున్నారట. ఆయనతో సినిమా చేయడానికి నెట్ ఫ్లిక్స్ సంస్థ రెడీగా ఉందట. ఈ ఆఫర్ అనుష్క వద్దకు కూడ వెళ్లిందట. కానీ స్వీటీ మాత్రం ఆ ప్రాజెక్టును కూడ వెయిటింగ్ లిస్టులో పెట్టేసిందట. దీన్నిబట్టి యువీ సినిమాను కంప్లీట్ చేసిన తర్వాతనే అనుష్క ఇంకొక సినిమా వైపు దృష్టి పెడుతుందనే సంగతి క్లియర్ అయింది. కానీ దర్శకులు, నిర్మాతలు మాత్రం అనుష్కను అప్రోచ్ అవ్వడం మాత్రం ఆగటంలేదు.

సంబంధిత సమాచారం :