కమల్ సినిమాలో అనుష్క.. నిజమవుతుందా ?

Published on Mar 24, 2020 3:22 pm IST

కమల్ హాసన్ సూపర్ హిట్ చిత్రాల్లో ‘వెట్టైయాడు విలైయాడు’ కూడా ఒకటి. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘రాఘవన్’ పేరుతో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనుందనే వార్తలు మొదలయ్యాయి. మొదట్లో ఇవి రూమర్లే అనుకున్నా ఇప్పుడు మాత్రం నిజమేనని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.

అంతేకాదు ఇందులో కథానాయకిగా అనుష్క పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇకపోతే గతంలో అనుష్క గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ‘యెన్నై ఆరిందాల్’ చిత్రంలో నటించగా వీరి కాంబోలో ఒక లేడీ ఒరియెంటెడ్ చిత్రంలో నటించాల్సి ఉండగా అది వర్కవుట్ కాలేదు. మళ్లీ ఇప్పుడు ‘వెట్టైయాడు విలైయాడు-2’ లో నటిస్తుందనే వార్తలు మొదలయ్యాయి. మరి ఇవి ఏమేరకు నిజమో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత సమాచారం :

X
More