అనుష్క కొత్త సినిమా అప్డేట్ !

అనుష్క కొత్త సినిమా అప్డేట్ !

Published on Feb 21, 2019 3:33 PM IST

‘భాగమతి’ తరువాత చాలా గ్యాప్ తీసుకున్నస్టార్ హీరోయిన్ అనుష్క ప్రస్తుతం ఆమె హేమంత్ మధుకర్ తెరకెక్కించనున్న చిత్రంలో నటించడానికి రెడీ అవుతుంది. ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ మార్చి నుండి మొదలుకానుంది. ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ అంత ఫారెన్ లోనే జరుగనుంది. ఇక ఈ చిత్రంలో అనుష్క ఎన్నారై అమ్మాయిగా కనిపించనుండగా అంజలి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటించనుంది వీరితో పాటు మాధవన్, సుబ్బరాజ్ , షాలిని పాండే ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.

గోపీ సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్ ,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈచిత్రం తెలుగు తోపాటు తమిళంలోనూ విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు