ప్రభాస్ అనగానే అనుష్కను లాక్కొస్తారు.. ఇదిగో క్లారిటీ

Published on Sep 30, 2020 12:07 am IST


ప్రభాస్ విషయంలో ఏలాంటి అంశమైనా ముందుగా అనుష్క పేరును తెర మీదికి తీసుకురావడం ఆనవాయితీ అయిపోయింది. ప్రభాస్ పెళ్లి నుండి సినిమాల వరకు అన్నిటిలోనూ అనుష్క పేరును లాక్కొచ్చి కొత్త రూమర్లు పుట్టించేస్తున్నారు. ఆ రూమర్లతో ప్రభాస్ అభిమానుల్లో సవాలక్ష ప్రశ్నలు, అనుమానాలు మొదలవుతుంటాయి. తాజాగా కూడ ప్రభాస్ చేయనున్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’లో అనుష్క నటించనుందని పుకార్లు లేచాయి.

రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో కనిపించనున్నారు. ఇది తెలియగానే ప్రభాస్ రాముడంటే ఇక సీత పాత్రలో నటించేది అనుష్కే కదా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అనుష్క ఈ రూమర్లపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఆమె నటించిన ‘నిశ్శబ్దం’ త్వరలో ఓటీటీ ద్వారా విడుదలకానుంది. ఈ సందర్బంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడిన అనుష్క ‘ఆదిపురుష్’ టాపిక్ రాగానే ఆ వార్తల్లో నిజం లేదని, తనకు అలాంటి ఆఫర్ ఏదీ రాలేదని చెప్పుకొచ్చారు. దీంతో ప్రభాస్, అనుష్కలు మరోసారి జోడీ కట్టడం మీద అనుమానాలన్నీ తొలగిపోయాయి.

సంబంధిత సమాచారం :

More